చినకాకాని జాతీయరహదారి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై అమరావతి ఐకాస నాయకులు బైఠాయించారు. జాతీయ రహదారిపై ఆందోళనకు అనుమతి లేదన్న పోలీసులు హెచ్చరించారు...రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
లైవ్ అప్డేట్స్: రాజధాని రైతుల హైవే దిగ్బంధం.. ముందస్తు అరెస్టులు - live updates

11:39 January 07
చినకాకాని జాతీయరహదారి పై ఉద్రిక్తత...
11:30 January 07
పత్తిపాటి గృహ నిర్బంధం...
చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును గృహనిర్బంధం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న వారిని గృహనిర్బంధం చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఎంత అణిచి వేస్తే అంతగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులే ఈ ప్రభుత్వానికి మరణశాసనం రాస్తారన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా మృతిచెందిన ఆరుగురు రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసినా ఎప్పుడూ అడ్డుకోలేదని..పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూడటం తగదని ఆయన పేర్కొన్నారు.
11:05 January 07
మాజీ ఎమ్మెల్యే యరపతినేని గృహనిర్బంధం...
మాజీ ఎమ్మెల్యే యరపతినేని నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతీయ రహదారి దిగ్బంధం నేపథ్యంలో యరపతినేనిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. వైకాపా మంత్రులు మాటలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారన్న యరపతినేని. విశాఖలో రాజధాని కావాలని ఏ ప్రజాప్రతినిధి అడిగారని ప్రశ్నించిన యరపతినేని.రాజధాని ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
11:01 January 07
ఎమ్మెల్సీ రాజేంద్రపసాద్, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, డొక్కాలు గృహ నిర్బంధం..
తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ను గృహ నిర్బంధం చేశారు. ఉయ్యూరు సిఐ పర్యవేక్షణలో టౌన్ ఎస్సై, రూరల్ ఎస్సైలు మరియు మూడు జీపులలో 30 మంది పోలీసులతో గృహాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రాజేంద్రప్రసాద్ వెళ్లాల్సిఉంది. ప్రభుత్వ వైఖరిపై రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు బొండ ఉమా, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను కూడా వారి గృహాల్లో హౌస్ అరెస్ట్ చేశారు.
10:33 January 07
చినకాకాని సీపీఎం కార్యాలయంలో ఉన్న రైతులు అరెస్ట్...
గుంటూరు జిల్లా చినకాకాని సీపీఎం కార్యాలయంలో ఉన్న రైతులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం కార్యాలయంలో సమావేశమైన 20 మంది మందడం రైతులను వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వ్యాను కింద దూరి మరి నిరసన వ్యక్తం చేశారు అన్నదాతలు. బలవంతంగా వారిని పోలీసులు లాగేశారు. అందోళకారులను పోలీసులు గుంటూరు తరలించారు.
10:31 January 07
కేశినేని నాని, దేవినేని ఉమ గృహనిర్బంధం...
విజయవాడలో ఎంపీ కేశినేని నాని, గొల్లపూడిలో మాజీమంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దేవినేని ఉమా హౌస్ అరెస్టును నిరసిస్తూ పెద్దఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకున్న ప్రజలు నినాదాలు చేశారు. పోలీసులను నెట్టుకుని దేవినేని ఉమ, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు.
10:04 January 07
చట్టాలు ఉల్లంఘిస్తే అడ్డుకుంటాం: డీఎస్పీ వీరారెడ్డి
చట్టాలు ఉల్లంఘించే వారినే మేం అడ్డుకుంటున్నామని డీఎస్పీ వీరారెడ్డి స్పష్టం చేశారు. దుకాణాలు మూసివేయించటం తాత్కాలికమేనని ఆయన తెలిపారు. వీఐపీ బందోబస్తులో భాగంగా స్వల్ప ఇబ్బందులుంటే ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని డీఎస్పీ తెలిపారు.
09:30 January 07
చినకాకానిలో రైతుల భోజన ఏర్పాట్లను అడ్డుకున్న పోలీసులు..
గుంటూరు జిల్లా చినకాకానిలో రైతుల భోజనం ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. తాము వండుకున్న భోజనాన్ని పోలీసులు తీసుకెళ్లారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన 2 వేల మందికి రైతులు భోజనం సిద్ధం చేశారు.
09:10 January 07
గల్లా జయదేవ్ గృహనిర్బంధం...
ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు.. నేను ఏం నేరం చేశానని ప్రశ్నించిన గల్లా...నేను తెదేపాలో ఉన్నందుకే ఇలా చేస్తున్నారా అని అగ్రహం వ్యక్తం చేశారు.. నేను ఏమైనా హింసకు పాల్పడ్డానా..లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడ్డానా అంటూ పోలీసులను నిలదీసిన జయదేవ్.
07:53 January 07
కొనసాగుతున్న తెదేపా నేతల ముందుస్తు అరెస్ట్‌లు...
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. విజయవాడ, పెనమలూరు నేతలు, కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పెనమూలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను గృహనిర్బంధం చేశారు. చినకాకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూల్ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.... గ్రామాల నుంచి ఎవరూ బయటకు రాకుండా పోలీసుల ఆంక్షలు విధించారు. విజయవాడలో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందును కూడా గృహనిర్బంధం చేశారు.. గొల్లపూడిలో మాజీమంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జాతీయరహదారి దిగ్బంధానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
మంగళగిరిలో 40 మంది తెదేపా నేతలు, ఐకాస నాయకుల గృహనిర్బంధం చేశారు. పలుగ్రామాల్లో తెదేపా కార్యకర్తలను అరెస్ట్ చేసి, తాడేపల్లి పీఎస్‌కు తరలించారు. గుంటూరులో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటిని గృహనిర్బంధం చేశారు.
07:38 January 07
తెదేపా నేతల గృహ నిర్బంధం
నేడు అమరావతి రైతులు పిలుపునిచ్చిన చినకాకాని జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం నాయకులను గృహ నిర్బంధం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.
చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొనకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా వసంతరాయపురంలో ఆయనను గృహ నిర్బంధం చేశారు.
మంగళగిరిలో గంజి చిరంజీవి, తాడేపల్లిలో పట్టణ, రూరల్ తెలుగు దేశం నాయకులను ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, రూరల్ అధ్యక్షుడు కొమ్మారెడ్డి నానిను గృహ నిర్బంధం చేశారు.