హైకోర్టు తీర్పుతోనైనా వైకాపా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు హితవుపలికారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పునర్నియామకంపై హైకోర్పు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్ ఏ తప్పూ చేయలేదని మొదటినుంచి చెప్పినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని ఆరోపించారు.
రాజ్యాంగ నిబంధనలను హైకోర్టు సమర్థించిందని శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రమేశ్‌కుమార్‌ను తప్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన స్వాగతించారు. వైకాపా ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బన్న యనమల... ఇకనైనా పద్దతి మార్చుకోవాలని హితవుపలికారు.
ఇదీ చదవండి : హైకోర్టు తీర్పుపై నేతల స్పందన