ETV Bharat / city

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే మూడు రాజధానులు: తెదేపా - మూడు రాజధానులు వార్తలు

అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసన చేపట్టాయి. రాజధాని అంశంలో వైకాపా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

tdp protests
tdp protests
author img

By

Published : Oct 10, 2020, 5:05 PM IST

అమరావతికి మద్దతుగా ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు ఈ నెల 12కు 300వ రోజుకు చేరనున్నాయి. ఈ క్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బ్రిటీష్ తరహా పాలన

పాలన ఆంగ్లేయుల 'విభజించు- పాలించు' విధానాన్ని వైకాపా ప్రభుత్వం పాటిస్తోందని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ దుయ్యబట్టారు. 3రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అందరి మధ్య కలహాలు రెచ్చకొడుతున్నారని ఆరోపించారు.

రాయలసీమ న్యాయ రాజధాని అని ప్రజలను మభ్య పెడుతున్నారు. హైకోర్టు రాయలసీమలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. ఒకవేళ పెట్టినా అదనంగా ఉద్యోగాలు, పరిశ్రమలు రావు. రైతులకు లబ్ధీ ఏమీ ఉండదు. 300 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవటం దుర్మార్గం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రభుత్వం గుర్తించాలి. అమరావతి రైతులకు మా మద్దతు ఉంటుంది- భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి

వ్యవస్థలన్నీ నాశనం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయని తెదేపా నేత నెట్టెం రఘరాం విమర్శించారు. అమరావతికి మద్దతుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో శ్రీరామ్ తాతయ్యతో కలిసి రఘురాం పాల్గొన్నారు. ఏ జిల్లాలో చూసినా వైకాపా నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు ఉదారంగా ఇచ్చిన రైతుల పట్ల కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. 300 రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు సీఎం జగన్మోహన్ రెడ్డికి పట్టవా అని ప్రశ్నించారు. అమరావతికి మద్దతుగా ఆదివారం తెదేపా శ్రేణులు నిరసన తెలపాని ఆయన కోరారు.

అభివృద్ధి శూన్యం

రాష్టంలో వైకాపా పాలన అస్తవ్యస్తంగా ఉందని.. కక్షసాధింపు చర్యలు తప్ప సుపరిపాలన ఎక్కడా కనిపించడం లేదని మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెద్ద రత్తయ్య అన్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్టాన్ని ముఖ్యమంత్రి ఏమి చేయాలని అనుకుంటున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని.. నిరోద్యుగుల సమస్య నానాటికి పెరిగిపోతుందని చెప్పారు. పోలీసుల తీరు సరిగ్గా లేదని.. న్యాయవ్యవస్థను వైకాపా నేతలు కించపరిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని.. రాబోయే రోజుల్లో అమరావతి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు.

మాట తప్పారు

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల మనోభావాలు కించపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ వరుపుల రాజా అన్నారు. అమరావతిని విచ్ఛీన్నం చేయడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ప్రత్తిపాడులో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్... ఇప్పుడు మాట తప్పారని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. రాజధానిగా అమరావతి ఉండేలా పోరాటం సాగిస్తామని తెలిపారు.

తుగ్లక్ పాలన

ముఖ్యమంత్రి జగన్​ పాలన తుగ్లక్​ని గుర్తు చేస్తోందని అమలాపురం మాజీ శాసనసభ్యుడు అయినా బత్తుల ఆనందరావు విమర్శించారు. రాజధాని రైతులు ఉద్యమం చేపట్టి 300 రోజులు సమీపిస్తున్న సందర్భంగా అమలాపురంలో ఆదివారం నల్ల వంతెన నుంచి గడియారస్తంభం సెంటర్ వరకు కాగడాల ప్రదర్శన చేపడతామని వెల్లడించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో మొండి వైఖరి విడనాడి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు.

మూడు ముక్కలు చేసేందుకే...

రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. శనివారం రంపచోడవరం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కుతుందన్నారు.

అన్నీ అబద్ధాలు

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందని వైకాపా పదే పదే చెప్పినా.... అది ఇప్పటివరకు జరగలేదన్నారు. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయనడం కూడా అవాస్తవమేనన్నారు. రైతులు న్యాయం కోసం పోరాడుతుంటే, కుల ముద్ర వేయడం దారుణమన్నారు. మహిళా రైతులు దిల్లీకి వెళితే అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించే వరకు తాము దశలవారీగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.