TDP leader Yarapatineni: కులాల పేరుతో వైకాపా నేతలు నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. చెలరేగిపోతున్న వైకాపా పేటీఎం బ్యాచ్‌కు రాష్ట్ర ప్రజలు, ప్రకృతే సమాధానం చెబుతాయని అన్నారు. తనను సస్పెండ్ చేస్తే.. వైకాపా నేతలందరి బాగోతం బయటపెడతానని గోరంట్ల మాధవ్ జగన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసినందుకే ఇంతవరకు అతడిని సస్పెండ్ చేయలేదని ఆరోపించారు. ఎన్టీఆర్ కుమార్తె మరణాన్ని రాజకీయం చేయాలని చూసిన వైకాపా నేతలకు.. గోరంట్ల మాధవ్ రాసలీలల రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. వైకాపా ఎంపీ మహిళల్ని వేధిస్తూ దొరికిపోయి ఓ కులాన్ని నిందించడం దుర్మార్గమని మండిపడ్డారు.
గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేయకపోగా... ఇవాళ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూర్చోపెట్టుకోవటానికి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అన్ని కులాల్ని సమానంగా చూస్తూ, గౌరవించే సంస్కృతిని నేర్చుకోవాలని హితవు పలికారు. జాతీయ స్థాయిలో వెలిగిన తెలుగువారు పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, బలయోగి, వేణుగోపాల్ రెడ్డి లాంటి వారికి కులం అంటగడతారా? అని ధ్వజమెత్తారు. కుల, మత రాజకీయాలను జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకనే కొన్ని సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.
కళ్యాణదుర్గంలో నిరసన : సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను.. వెంటనే సస్పెండ్ చేయాలని కళ్యాణదుర్గంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఎంపీ గోరంట్ల మాధవ్ చిత్రపటాలను చెప్పులతో కొట్టారు. మాధవ్ ను.. పార్టీతోపాటు ఎంపీ పదవి నుంచీ తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: