ఏసీబి అధికారులు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇది రాక్షసపాలనలో జరిగిన అరాచకమని మండిపడ్డారు. జగన్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, చట్టవిరుద్ద విధానాలకు తాజా పరిణామాలే నిదర్శనమని యనమల ఆక్షేపించారు. పైకి వస్తున్న బీసీ నాయకులను అణచివేసేందుకు జగన్ చేస్తున్న కుట్రలో భాగమే ఇదన్న యనమల..., బీసీ సంఘాలన్నీ దీన్ని తీవ్రంగా ఖండించాలని సూచించారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు