ETV Bharat / city

అధికారంలో ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా బీసీల పార్టీనే: యనమల - TDP leader Yanamala news

బీసీల పార్టీగా తెలుగుదేశం మరోసారి రుజువైందని శాసన మండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రెండు రాష్ట్రాలకు బీసీలే తెదేపా అధ్యక్షులన్న ఆయన... 'ఆదరణ' పథకం రద్దుతో వైకాపా ప్రభుత్వం బీసీల పొట్టగొట్టిందని మండిపడ్డారు.

TDP leader Yanamala comments on BCs
శాసన మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు
author img

By

Published : Oct 20, 2020, 2:15 PM IST

పార్టీ పదవుల్లో అత్యధిక అవకాశాలతో.. తెలుగుదేశం బీసీల పార్టీగా మరోసారి రుజువైందని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తెదేపా సంస్థాగత కమిటీల్లో బీసీలకు పెద్దపీట వేసినందుకు అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాల సైకిల్‌ సారథులు బీసీలేనని యనమల గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లుసగానికిపైగా తగ్గించిన వైకాపా సర్కార్‌... 'ఆదరణ' పథకం రద్దుతో వెనుకబడిన వర్గాల పొట్టగొట్టిందని మండిపడ్డారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ బీసీలకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. టీటీడీ సహా ఇతర అన్ని కీలక పదవులను జగన్ సొంత సామాజికవర్గానికే కట్టబెడుతున్నారని అయన విమర్శించారు. తితిదే ఛైర్మన్లుగా బీసీలైన కళా వెంకట్రావు, పుట్టా సుధాకర్ యాదవ్ లను తెదేపా నియమిస్తే..., తాజా పాలకమండలిలో ఎటు చూసినా జగన్ సామాజికవర్గమేనని మండిపడ్డారు. ఛైర్మన్,ఈవో, జెఈవో, అందరినీ ఏరికోరి నియమించిన చరిత్ర జగన్ దేనని దుయ్యబట్టారు. వైకాపా 4 ప్రాంతాల బాధ్యులుగానూ విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఒకే సామాజికవర్గం వారన్న యనమల..., స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను సగానికి పైగా తగ్గించారని ధ్వజమెత్తారు. కొన్ని జిల్లాలలో 11శాతం కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు.

జగన్ ద్రోహం వల్లే వేలాది పదవులకు బీసీలు దూరమయ్యారని ఆరోపించారు. బీసీ నిధులను దారిమళ్లించి నమ్మకద్రోహం చేయటంతో పాటు స్పెషల్ కాంపోనెంట్ నిధులనూ భారీగా మళ్లించారని విమర్శించారు. బీసీ కాలనీల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటుకు తూట్లు పొడిచి అన్ని జిల్లాల్లో బీసీ భవన్ ల నిర్మాణం నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధుల విదేశీ విద్యకు గ్రహణం పట్టించి ‘ఆదరణ’ పథకాన్ని రద్దు చేసి పొట్టగొట్టారని యనమల మండిపడ్డారు. వందల కోట్ల విలువైన ఆధునిక పనిముట్లన్నీ గోడౌన్లలో పాడైపోయినా పంపిణీకి ముందుకు రాకపోవటం జగన్ కక్షసాధింపునకు నిదర్శనమన్నారు. నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి... 56 కార్పొరేషన్ల ప్రకటనలకు కూడా బీసీ నిధులే ఖర్చు చేయటంతో పాటు సంక్షేమ పథకాలను బీసీ పద్దులో చూపటం జగన్మాయేనని విమర్శించారు. అన్నీ గమనిస్తున్న ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ మరోసారి బీసీల పార్టీగా రుజువైందన్న యనమల... సంస్థాగత కమిటీలలో పెద్దపీట వేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:

తెదేపా నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అభినందనలు: కళా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.