నెల్లూరు జిల్లాలో మట్టిమాఫియాను అడ్డుకున్న ఎస్సీ యువకుడు కరకట మల్లికార్జున్‌పై వైకాపా నేతలు దాడి చేయటంతో పాటు పోలీసులు అతనిపై అక్రమంగా కేసు నమోదు చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ విషయమై షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు లేఖ రాశారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలపై అనేక దాడులు జరుగుతున్నా జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఉదాసీనత తగదన్నారు. మల్లికార్జున్ పై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడిచేసిన అధికార పార్టీ నేతల్ని వదిలి మల్లికార్జున్ పై కేసు పెట్టడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గత రెండేళ్లలో ఎస్సీలపై జరిగిన దాడులను విచారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: RRR Letter: పరీక్షల రద్దుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఎంపీ రఘురామ