జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. గుంటూరు జిల్లా పల్నాడుకు చెందిన యలమంద నాయక్‌కు అన్యాయం జరిగిందని.. అక్రమ కేసుల పేరుతో పోలీసులు వేధించారని పేర్కొన్నారు. పోలీసులు, రౌడీలు కలిసి కిడ్నాప్ చేశారని.. అక్రమంగా 10 రోజుల పాటు జైల్లో బంధించారని ఆరోపించారు. వెంటనే స్థానిక పోలీసులపైన, కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి