ETV Bharat / city

'ఎస్సీల మీద దాడులపై సీబీఐతో దర్యాప్తు చేయించండి' - tdp leader varla ramaiah latest comments on ycp

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల మీద.. సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు.

tdp leader varla ramaiah
tdp leader varla ramaiah
author img

By

Published : Sep 19, 2020, 9:16 AM IST

ఎస్సీలపై వైకాపా ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందంటూ గవర్నర్‌కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నడూ లేని విధంగా ఎస్సీ యువకులకు శిరోముండనం ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అత్యాచారాలు, హత్యల వంటి దురాగతాలు ఎక్కువ అవుతున్నాయని పేర్కొన్నారు.

కొందరు పోలీసులు సైతం అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎస్సీలపై జరుగుతున్న దాడుల మీద సమగ్రంగా సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు సహా ఎస్సీ మహిళ ఇల్లు తగలపెట్టిన ఘటనలకు సంబంధించిన పుస్తకాన్ని లేఖకు జతపరిచారు.

ఇదీ చదవండి:

వైకాపాలోకి విశాఖ తెదేపా ఎమ్మెల్యే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.