ETV Bharat / city

డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ... ఎందుకంటే..?

Varla Ramaiah: వివేకా హత్య కేసు విషయంలో దస్తగిరి, సీబీఐ అధికారులకు భద్రత కల్పించాలని డీజీపీని వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. దస్తగిరి, అధికారులకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఏపీ డీజీపీకి  తెదేపా నేత వర్ల రామయ్య లేఖ
ఏపీ డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ
author img

By

Published : May 31, 2022, 9:31 AM IST

Varla Ramaiah: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, సీబీఐ అధికారులపైనా.. స్థానిక పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం మానాలంటూ.. తెలుగుదేశం నేత వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. దస్తగిరికి భద్రత కల్పించాలని కోరారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు.. స్థానిక పోలీసులు.. దస్తగిరిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపైనా.. తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. సీబీఐ బృందంపై.. బాంబులు విసురుతామంటూ బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండటంతోనే.. వారి ఆదేశాల మేరకే పోలీసుల వ్యవహార శైలి ఉంటోందని వర్ల రామయ్య.. తన లేఖలో పేర్కొన్నారు. దస్తగిరికి, సీబీఐ దర్యాప్తు అధికారులకు ఏదైనా హాని జరిగితే.. వైకాపా ప్రభుత్వంతోపాటు.. రాష్ట్ర పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని.. డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.