ETV Bharat / city

తాడేపల్లి ప్యాలెస్​లో సంక్రాంతి వెలుగులు.. చంద్రయ్య, నరేంద్ర ఇళ్లలో చీకట్లు: వర్ల - వైకాపా ప్రభుత్వంపై వర్ల పైర్

Varla Fires on YSRC Govt: రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ సంక్రాంతి దీపాలతో వెలుగిపోతే.. తెదేపా నేతల ఇళ్లలో చీకట్లు కమ్ముకున్నాయని అన్నారు. రైతు నరేంద్ర కేసులో ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.

tdp leader varla
tdp leader varla
author img

By

Published : Jan 16, 2022, 7:19 PM IST

Varla Fires on YSRC Govt: రాష్ట్ర ప్రభుత్వం ముద్దాయిలకు, నేరస్థులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఎవరిని సంతృప్తిని పర్చడం కోసం జొన్నలగడ్డలో తెదేపా నాయకుడు అరవింద్ బాబును పోలీసు అధికారి బూటు కాలితో తన్నారని మండిపడ్డారు. బూటు కాలితో తన్నిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని వర్ల డిమాండ్ చేశారు.

కొంత మంది పోలీసు అధికారులు అధికార పార్టీకి దాసోహాం అవుతున్నారని వర్ల మండిపడ్డారు. పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారిన పోలీసు వ్యవస్థను కాపాడడానికి ఎవరో ఒకరు రావాలని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ సంక్రాంతి విద్యుత్ దీపాలతో వెలుగిపోతే.. అరవిందబాబు, మాచర్ల చంద్రయ్య, వినుకొండ రైతు నరేంద్ర ఇళ్లలో చీకట్లు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ ఘటనలో సీఐని సప్పెండ్ చేసి, కేసు దర్యాప్తు చేసిన ఎస్సైను ఎందుకు సప్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. కుల వివక్ష చూపించారా..? అని నిలదీశారు.

ఇదీ చదవండి

విద్యాసంస్థల సెలవుల పొడిగింపు ఆలోచన లేదు: మంత్రి సురేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.