పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని మంత్రిగా నియమించే సమయంలోగానీ, ఆ తర్వాత గానీ ఆయన వ్యవహార శైలి సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రజల్ని ఆకర్షించిన దాఖలాలు లేవని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంత్రి మాట తీరు, ఆహార్యం వ్యవహారాలు చూసి కేబినెట్లో కొనసాగిస్తున్నారంటే... ప్రభుత్వానికి పాలన పట్ల ఉన్నచిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలతో పాటు కరోనాపై పోరాడుతున్న తమపై మాట్లాడిన మాటలు విస్మయం కలిగించాయన్నారు. ప్రభుత్వ వైపల్యాలను ప్రశ్నిస్తే అసభ్యకరంగా మాట్లాడాతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పేదల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం