వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్.. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి వస్తున్నారని దేశమంతా తెలిసినా పోలీసులకు తెలియదా అని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. జోగి రమేశ్ చంద్రబాబు ఇంటికి వచ్చిన 40 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారన్నారు. జోగి రమేశ్ చంద్రబాబు ఇంటికి వస్తున్నారని పోలీసులకు ముందే తెలిసినా.. గుంటూరు పోలీసులు మీడియాతో అన్ని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
జోగి రమేశ్ దాడిని పోలీసులు సమర్ధించడం దారుణమని వర్ల రామయ్య ఆరోపించారు. జోగి రమేశ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చంద్రబాబు దగ్గర ఉండే ఎన్ఎస్జీ గార్డులు.. సినిమా చూపించేవాళ్లని అన్నారు. ఇప్పటికైనా జోగి రమేశ్‌ని అరెస్ట్ చేసి రౌడీషీట్ తెరవాలని వర్ల రామయ్య (varla ramaiah demand police open rowdy sheet on jogi ramesh) డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: