వెలగపూడి ఘటనకు ఆధిపత్య పోరే కారణమని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఎంపీ గొప్పా, ఎమ్మెల్యే గొప్పా అనే వాదనతో ప్రారంభమైన వివాదం రెండువర్గాల మధ్య గొడవకు దారి తీసిందని మండిపడ్డారు. వివాదంలోకి హోంమంత్రి భర్త దయాసాగర్, నెల్లూరులో ఎస్ఐగా పని చేస్తున్న తురకా వెంకటరమణ జోక్యం చేసుకోబట్టే...అది కాస్తా తారాస్థాయికి చేరిందన్నారు.
వెలగపూడి ఘటనలో కీలకంగా వ్యవహరించిన దయాసాగర్, వెంకటరమణలపై.. హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా సీఎం ఏకపక్షంగా వ్యవహారిస్తే..ఆ ఘటనలు ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని చెప్పారు. తెదేపా ఎప్పుడూ న్యాయం, ధర్మం,చట్టం వైపే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి