ETV Bharat / city

'తితిదే ప్రధాన అర్చకులుగా రమణదీక్షితుల్ని మళ్లీ ఎలా నియమించారు'

తితిదే ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితుల్ని మళ్లీ నియమించటంపై తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు. క్రైస్తవ మతస్థుడైన జగన్ రెడ్డి ఏ అవగాహనతో రమణ దీక్షితులని నియమించారని వర్ల ప్రశ్నించారు.

varla ramaiah
తెదేపానేత వర్ల రామయ్య
author img

By

Published : Apr 9, 2021, 6:18 PM IST

క్రైస్తవ మతస్థుడైన జగన్ రెడ్డి ఏ అవగాహనతో తితిదే ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితుల్ని మళ్లీ నియమించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. సహా నిందితుడైన విజయసాయి రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించి ధర్మాన్ని విస్మరించారని మండిపడ్డారు.

''రమణ దీక్షితుల్ని మళ్లీ ప్రధాన అర్చకులుగా నియమించటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం. హైందవ మతాచారులతో ఆటాలాడటం సీఎంకు తగదు. భగవంతుడికి సేవ కాకుండా కొంతమంది వ్యక్తులకు సేవ చేసే వివాదాస్పదుడు రమణ దీక్షితులు. విజయసాయి రెడ్డి పింక్ డైమాండ్​పై చేసిన ఆరోపణలకు మద్దతు పలికి, స్వామివారి ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా రమణ దీక్షితులు మాట్లాడారు. ఇద్దరిపైనా రూ. 200కోట్ల పరువు నష్టం దావా కేసు కోర్టులో నడుస్తోంది. క్రైస్తవ మత ఆరాధకుడైన జగన్ రెడ్డిని విష్ణుమూర్తితో పోల్చి రమణ దీక్షితులు తన పొగరు ప్రదర్శించారు. స్వామీజీలు దీనిపై స్పందించాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తితిదే ప్రాభవం మసకబారుతోంది. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులకు క్రైస్తవ మతం పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే" అని వర్ల దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

అమిత్ షా ఎవరికి భయపడుతున్నారు: మంత్రి పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.