ETV Bharat / city

మంత్రి జయరామ్‌పై ‘ఈడీ’ విచారణ జరపాలి - మంత్రి జయరామ్​

కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను అరెస్టు చేసి.. ఆయన అవినీతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తో (ఈడీ) విచారణ జరిపించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండు చేశారు. మంగళగిరిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య
author img

By

Published : Jul 25, 2022, 9:04 AM IST

కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను అరెస్టు చేసి.. ఆయన అవినీతిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తో (ఈడీ) విచారణ జరిపించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండు చేశారు. మంగళగిరిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత నెల 30న కార్మికశాఖ కమిషనర్‌ కార్తికేయ మిశ్రా జోన్‌ 3లో కొన్ని బదిలీలు చేశారు. ఈ ఉత్తర్వులను ఆ శాఖ జాయింట్‌ కమిషనరు శ్రీనివాస్‌ కుమార్‌ అమలు చేయలేదు. మంత్రి జయరామ్‌ చెప్పారని జేసీ ప్రత్యేకంగా బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఇందులో మంత్రి సొంత మనుషులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.లక్షల్లో నగదు చేతులు మారింది’ అని ఆరోపించారు. కార్తికేయ మిశ్రా తన మాట వినడం లేదనే అక్కసుతోనే ఆయన ఆదేశాలను మంత్రి జయరామ్‌ పక్కనపెట్టారని పేర్కొన్నారు. ‘జాయింట్‌ కమిషనరును లొంగదీసుకుని ఆయనతో ఆదేశాలు ఇప్పించారని తెలిపారు. జి.నాగరాజు అనే అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ను అమరావతికి బదిలీ చేస్తే జేసీ ఆయనను పిడుగురాళ్లకు మార్చారు. ఎం.వెంకటేశ్వరరావు అనే అధికారిని నెల్లూరు నుంచి నాయుడుపేటకు వేస్తే.. ఒంగోలుకు బదిలీ చేశారు. సుకన్య అనే అధికారిణిని అమరావతికి, ఎం.వినయ్‌ కుమార్‌ను తెనాలికి, కె.సాంబశివారెడ్డిని గుంటూరుకు, బి.కోటేశ్వరరావును చిలకలూరిపేటకు చిత్తానుసారం మార్చారు. మంత్రి చెప్పారని ఇలా వ్యవహరిస్తారా? ఈ మొత్తం వ్యవహారంపై సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి’ అని డిమాండు చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.