ETV Bharat / city

Seethanagaram incident: నిందితుల్ని శిక్షించకుంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తాం: అనిత

వైకాపా ప్రభుత్వ తీరుపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచార నిందితులను వైకాపా నేతలే కాపాడుతున్నారని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం చేసి.. నిందితుల్ని శిక్షించకపోతే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

tdp leader vangalapudi anitha
tdp leader vangalapudi anitha
author img

By

Published : Jul 7, 2021, 8:55 PM IST

సీతానగరం అత్యాచార ఘటన నిందితుల్ని వైకాపా నేతలు కాపాడుతున్నారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. నిందితులు వైకాపాకి చెందిన వారు కావటంతో కేసును నీరుగార్చుతున్నారని విమర్శించారు. వీరికి ఎమ్మెల్యేలు ఆళ్లరామకృష్ణారెడ్డి, వసంతకృష్ణప్రసాద్​ల అండ ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కే ఇంట్లో సోదాలు చేస్తే నిందితుల సమాచారం దొరుకుతుందని చెప్పారు.

బాధితురాలికి న్యాయం చేసి నిందితుల్ని శిక్షించకుంటే మహిళలంతా కలిసి సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని అనిత హెచ్చరించారు. జగన్ రెడ్డి తెచ్చిన దిశ చట్టంలో నిబద్ధత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో 520 మంది మహిళలు అత్యాచారలు, దాడులకు గురైతే ఒక్కరికీ న్యాయం జరగలేదని విమర్శించారు. దాడులు, అఘాయిత్యాలు.. మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ కు చీమకుట్టినట్లుగా కూడా లేవని ఆక్షేపించారు. దిశ చట్టం ద్వారా నిందితులను శిక్షించామని హోంమంత్రి అసత్యాలు చెప్పటం సిగ్గుచేటన్నారు.

అనుబంధ కథనం:

Gang Rape: కాబోయే భర్తను కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.