ETV Bharat / city

'ఆ మంత్రుల పాలనలో ఉండడం దురదృష్టకరం' - ashok babu on it raids

ఐటీ దాడులపై ఆంగ్ల పత్రిక ప్రకటన అర్థం చేసుకోలేని మంత్రులు సీఎం జగన్ కేబినెట్​లో ఉన్నారని తెదేపా ముఖ్య నేత వర్ల రామయ్య ఆరోపించారు. ప్రకటన అర్థం కాకపోతే తెలుగులో తర్జుమా చేసి పంపుతామని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కార్యదర్శి ఇంట్లో రూ.2 వేల కోట్లు సీజ్​ చేసినట్లు.. సీబీడీటీ ప్రకటనలో ఎక్కడుందో చూపాలని సవాల్ విసిరారు. మంత్రులు, వైకాపా నేతలపై ఐటీ దాడులను ఆపాలని కోరేందుకే సీఎం జగన్ హస్తినలో పర్యటిస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్​బాబు విమర్శించారు.

Tdp leaders
తెదేపా నేతలు
author img

By

Published : Feb 14, 2020, 5:56 PM IST

Updated : Feb 14, 2020, 6:21 PM IST

ఐటీ దాడులపై సీబీడీటీ(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ఇచ్చిన పత్రికా ప్రకటన అర్థం చేసుకోలేని మంత్రులు జగన్ కేబినెట్​లో ఉన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అలాంటి వారి పాలనలో రాష్ట్రం ఉండడం దురదృష్టకరమన్నారు. మంత్రులకు ఆంగ్ల ప్రకటన అర్థం కాకుంటే తెలుగులో తర్జుమా చేసి పంపుతామని మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఆయన వ్యాఖ్యానించారు. సీబీడీటీ చేసిన పత్రికా ప్రకటనలో చంద్రబాబు కార్యదర్శి వద్ద రూ.2 వేల కోట్లు సీజ్ చేసినట్లు ఎక్కడుందో చూపాలని సవాల్ విసిరారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో మంత్రులు దుష్పచారం చేస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు.

తెదేపా కార్యాలయంలో మాట్లాడుతున్న వర్ల రామయ్య

దమ్ముంటే ఆ కంపెనీల వివరాలు బయటపెట్టండి : అశోక్ బాబు
చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్​పై జరిగిన ఐటీ దాడుల వివరాలు తెదేపానే బయటపెడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. జగన్, అతని బృందం ఆంగ్లం బాగా వచ్చిన వారితో సీబీడీటీ ఇచ్చిన పత్రికా ప్రకటన చదివించుకోవాలని హితవు పలికారు. పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ.2 వేల కోట్లు దొరికాయని ప్రకటనలో ఎక్కడుందో మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపా నేతలకు ధైర్యం ఉంటే ఐటీ దాడులు జరిగిన ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కంపెనీల పంచనామా వివరాలు బయటపెట్టాలని అశోక్ బాబు సవాల్ విసిరారు.

ఐటీ దాడులపై మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అశోక్ బాబు

ఇదీ చదవండి : 'ఐటీ సోదాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి'

Last Updated : Feb 14, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.