ETV Bharat / city

SOMIREDDY: వివేకా హత్య కేసులో అసలు హంతకుల్ని తప్పించేందుకు కుట్ర: సోమిరెడ్డి - vivekamurder case

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకులను కేసు నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

సోమిరెడ్డి
సోమిరెడ్డి
author img

By

Published : Aug 22, 2021, 10:26 AM IST

Updated : Aug 22, 2021, 10:46 AM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకులను కేసు నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసును సీబీఐ లాంటి సర్వోన్నత నేరపరిశోధన సంస్థ రెండేళ్లుగా విచారిస్తూ.. ఇప్పుడు నిందితుల సమాచారమిస్తే రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఇదంతా సీబీఐ వ్యవస్థకే మాయనిమచ్చగా మిగిలిపోనుందని ఆయన విమర్శించారు.

విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలం: బీ.టీ.నాయుడు

విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు దుయ్యబట్టారు. విద్యుత్ మీటర్లకు అంగీకార పత్రం ఇవ్వకపోతే విద్యుత్ నిలిపివేత దుర్మార్గమని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చారని మండిపడ్డారు.

పంటకు గిట్టుబాటు ధర లభించక, ఇన్ పుట్ సబ్సీడీ, పంట బీమా లేక వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితిలో రైతాంగం ఉందని దుయ్యబట్టారు. 50 లక్షల ఎకరాలకు యూరియా కొరత ఉందని, చంద్రబాబు నాయుడు సకాలంలో విత్తనాలు సరఫరా చేస్తే.. జగన్ ప్రభుత్వంలో మాత్రం నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు లభ్యమవుతున్నాయని విమర్శించారు. సున్నా వడ్డీలాగా ఉచిత విద్యుత్ నూ నీరుగార్చే కుట్రపన్నారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి:

Corona cases: దేశంలో కొత్తగా 30,948 మందికి వైరస్

Last Updated : Aug 22, 2021, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.