అమరావతిపై వైకాపాకు ఉన్న కక్షను ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక తేటతెల్లం చేసిందని... తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజధాని భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు లక్షల కోట్లు అవసరం లేదని తాము మొదటి నుంచీ చెబుతున్న విషయమే కమిటీ కూడా తేల్చిందని వివరించారు. అమరావతిలో 70 శాతం పూర్తయిన భవనాలకు 300 కోట్ల రూపాయలు చాలని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదించిందని చెప్పారు.
రూ.2,112 కోట్లతో అన్ని భవనాల నిర్మాణం పూర్తి చేయవచ్చని కమిటీ స్పష్టం చేసిందని సోమిరెడ్డి చెప్పారు. విలువైన ప్రాంతాన్ని నిర్మించడం కష్టతరమైనా చరిత్రలో ఆదర్శంగా నిలిచిపోతుందన్న ఆయన... వాటిని నిర్వీర్యం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. అధికారం చేతిలో ఉందని ప్రజల ఆస్తులను శిథిలం చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరికీ అనువైన ప్రాంతం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ