పరిపాలన చేయడం చేతకాక ప్రభుత్వం ప్రతిపక్షంపై దాడులు చేస్తుందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు... తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ నివాసానికి వచ్చి, సోమవారం నాటి పోలీసు చర్యలపై ఆరా తీశారు. మీడియాని చూసి పోలీసులు పట్టాభిరామ్‌ను అరెస్ట్ చేయకుండా వెళ్లిపోయారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. తెదేపా నేతలను పోలీసు చర్యలతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైకాపా తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం భయపడదని స్పష్టం చేశారు. విధ్వంసంతో పాలన మొదలుపెట్టిన జగన్... హోటల్లో సీసీ కెమెరాల ఫుటేజీ పట్టుకురావడం కోసమే ఒక ఛాన్స్ ఇవ్వండని అడిగారా అని దుయ్యబట్టారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవినీతిపై తన పోరాటం ఆగదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారి ఇంటికి వెళ్లాల్సిన పోలీసులు తప్పు బయట పెట్టిన వారి ఇంటికి రావడం సిగ్గుచేటన్నారు. 108లో అవినీతి బయటపెట్టినందుకు పట్టాభిని బెదిరిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. అరాచకాలు చేసి రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని సీఎం చూస్తున్నారని మండిపడ్డారు. పట్టాభికి తెలుగుదేశం అండగా ఉంటుందని అన్నారు. దోచుకోవడమే వైకాపా పరమావధిగా పెట్టుకుందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. పట్టాభిని బెదిరించాలని వైకాపా చూస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి: