Tdp leader pattabhi on kodali nani: పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని బియ్యం దొంగగా మారి.. పేదల తిండి బొక్కేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. ఎమ్మెల్యేలు ద్వారంపూడి, సామినేని ఉదయభానుతో కలిసి మంత్రి కాకినాడ పోర్టు ద్వారా అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న బ్లాక్ మార్కెట్ కారణంగానే నిత్యావసరాల ధరలు పెరిగాయని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదని, నిత్యావసరాలు పెరిగాయని మంత్రే స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. పేదలకు తిండి అందక పస్తులుంటున్నారని మీడియా సాక్షిగా అంగీకరించారని స్పష్టం చేశారు.
ఆర్టీఐ సమాచారం ప్రకారం తెదేపా ప్రభుత్వం కంటే.. ఇవాళ్టి వైకాపా ప్రభుత్వం తక్కువ ధాన్యం కొనుగోలు చేసిందని వెల్లడించారు. రేషన్ షాపుల్లో అందించే సరుకుల ధరలు కూడా పెంచారనేది అబద్ధమా..? అని ప్రశ్నించారు. కమీషన్లు ముడితే చాలు ఏమైనా చేసుకోండి అనే పరిస్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రెండున్నరేళ్లలో తెచ్చిన రూ.16,100 కోట్ల రుణాన్ని ఎవరికి దోచి పెట్టారని నిలదీశారు.
ఇదీ చదవండి:
FAMILY SUICIDE: నిజామాబాద్ వాసుల ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే ?