తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన 5 వేల732కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు వసూలు చేయకుండా సీఎం జగన్ రెడ్డి.. ప్రజలపై భారం మోపటం దుర్మార్గమని తెలుగుదేశం ధ్వజమెత్తింది. కొవిడ్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి వారిపై అదనపు భారం మోపుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
ఇప్పటికే నీళ్ల విషయంలో చేతులెత్తేసిన సీఎం జగన్ హైదరాబాద్‌లో ఆస్తులు, సర్వ హక్కుల్ని కూడా తెలంగాణకు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం, స్వలాభం కోసం ప్రతిదీ తెలంగాణకు తాకట్టు పెడుతూ.. రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారం మోపుతున్న తీరును అంతా గమనించాలని పట్టాభిరామ్ అన్నారు.
'విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపటం దుర్మార్గం. ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి అదనపు భారం మోపుతున్నారు. రెండేళ్లలోనే మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణను పెండింగ్ విద్యుత్ బకాయిలు అడిగే ధైర్యం చేయట్లేదు.'
ఇదీ చదవండి: