TDP Leader Ramanaidu on Polavaram: పోలవరంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పాదయాత్ర సమయంలో డయాఫ్రం వాల్ కూడా పూర్తవలేదన్నారు. డయాఫ్రం వాల్ అంటే ఏంటో కనీస జ్ఞానం లేని వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు. రావణుడు రామాయణం చెప్పినట్లు.. పోలవరంపై జగన్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి చేతకానితనంతో పోలవరం ప్రశ్నార్ధకమైందన్నది పచ్చి నిజమని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి పాలనలో 4శాతం పనులు చేసినట్లు కేంద్ర జలశక్తి సంఘం తెలిపిందని గుర్తు చేశారు. అన్ని ప్రాజెక్టులకూ డయాఫ్రం వాల్ ఉంటుందన్న మహా మేధావి మంత్రి అని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రసంగంతో పోలవరంపై జగన్ రెడ్డి అజ్ఞానం బట్టబయలైందన్నారు. 14 నెలల పాటు జగన్ రెడ్డి నిర్వాకం కారణంగానే డయాఫ్రంవాల్ దెబ్బతిన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 శాతం కాఫర్ డ్యాం పనులు చేయలేని జగన్ రెడ్డికి పదవిలో కొనసాగే అర్హత లేదని దుయ్యబట్టారు.
జగన్ రెడ్డి మూర్ఖత్వంతో ఫ్లడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను గాలికి వదిలేశారని తెలిపారు. తాడేపల్లి రాజప్రాసాదంలో కూర్చుంటే పోలవరం నిర్వాసితుల బాధలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఎకరాకు రూ.19 లక్షలిస్తానని పాదయాత్రలో హామీ ఇవ్వడం నిజం కాదా? అని నిలదీశారు. జీవో ఇచ్చి 16 నెలలు పూర్తైనా ఒక్కరికీ 10 లక్షల పరిహారం అందలేదని అసెంబ్లీలో మంత్రి సమాధానం చెప్పారని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
ఇవీ చదవండి: