తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... వైకాపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైకాపా తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక తెదేపా అభ్యర్థులకు వైకాపా కండువాలు కప్పుతున్నారని అన్నారు. ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారని మండిపడ్డారు. వైకాపా ఒక పార్టీ.. జగనో నాయకుడా... అని ఆక్షేపించారు. పలాస, రాయదుర్గంతో పాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అని అన్నారు.
జగన్కు తాడేపల్లి ఇంటి గేటు దాటి వస్తే జనం కొడతారని భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వైకాపా అభ్యర్ధులు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల వేళ పీకమీద కత్తి పెట్టి.. వైకాపా నాయకులు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే తెదేపా అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని..... అందుకే జగన్ను పిరికివాడు అంటున్నారని ట్వీట్ చేశాడు.
ఇదీ చూడండి: