ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ.. తెలుగుదేశమని ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైకాపాలాగా పదవి కోసం పుట్టిన పార్టీ తెదేపా కాదని వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్ష పాత్రలు పోషించే సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు.
వైకాపా బెదిరింపులకు భయపడేది లేదని మంత్రి సీదిరి అప్పలరాజును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల విషయంలో దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఓడిపోతే అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: