సీఎం జగన్ తన ఆస్తులు పెంచుకునేందుకే మూడు రాజధానుల డ్రామా ఆడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాజధాని మార్పు ప్రకటన తర్వాత విశాఖలో జరిగిన 70వేలకుపైగా రిజిస్ట్రేషన్లు వైకాపా నేతలవేనని అన్నారు. తన స్వార్ధం కోసం అమరావతిని ముఖ్యమంత్రి జగన్ బలి తీసుకున్నారని దుయ్యబట్టారు.
బీసీ, ఎస్సీలు ఎక్కువగా ఉన్న అమరావతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బీసీల వెన్నెముకను విరిచేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. విధులు, నిధులు, హోదాలన్నీ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి, కుర్చీలులేని 56 కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇచ్చారని విమర్శించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలోనే అందుకు సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రజల ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహం : చంద్రబాబు