వీసీల నియామకంలో బీసీలకు జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉందా..? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. బీసీ విద్యార్థులను విదేశీ విద్యకు దూరం చేశారని మండిపడ్డారు. 1187 బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను జగన్ ప్రభుత్వం నిలిపేసి.. ఆ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు తెదేపా ఒక్కటే అసలైన రాజకీయ వేదికని స్పష్టం చేశారు. వైకాపా అంటేనే అవినీతి, అరాచకమన్న ఆయన... జగన్ పాలనలో బీసీలు సంతోషంగా ఉన్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పడం హాస్యాస్పదమన్నారు.
ఇదీ చదవండి