ETV Bharat / city

చంద్రబాబు వ్యాఖ్యలు కేవలం వారిని ఉద్దేశించినవే: దివ్యవాణి - బైబిల్ మతంపై చంద్రబాబు వ్యాఖ్యలు

బైబిల్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కేవలం కొందరి దురాలోచనలను దృష్టిలో ఉంచుకుని చేసినవే తప్ప... క్రైస్తవులను ఉద్దేశించి కాదని తెదేపా నేత దివ్యవాణి స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యల్లో తప్పులేకపోయినా ఎవరినైనా కష్టపెట్టుంటే తాను క్షమాపణ కోరుతున్నానన్నారు.

తెదేపా నేత దివ్వవాణి
divya vani react on chandrababu comments
author img

By

Published : Jan 20, 2021, 5:08 PM IST

బైబిల్​ను వ్యాపారంగా మార్చుకున్న కొందరి దురాలోచనలు కట్టడి చేయాల్సిన సమయం వచ్చిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై క్రైస్తవులు కలవరపడొద్దని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వ్యాఖ్యల్లో తప్పులేకపోయినా ఎవరినైనా అవి కష్టపెట్టుంటే తాను క్షమాపణ కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో హిందూమతంపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి , డీజీపీ, హోంమంత్రి ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించే సందర్భంలోనే చంద్రబాబు వారి మతాల ప్రస్తావన తెచ్చారని స్పష్టం చేశారు. ముగ్గురూ ఒకే మతానికి చెందినవారు కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలనేదే చంద్రబాబు అభిమతమన్నారు. రాజ్యాంగ విధానాన్ని, బైబిల్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎవరికీ ఈ వ్యాఖ్యల్లో తప్పు కనిపించదని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి, హిందూమతంపై జరిగిన ఘటనలే, క్రైస్తవులపై జరిగితే చూస్తూ ఊరుకునేవారు కాదనే విషయాన్ని క్రైస్తవులంతా గ్రహించాలని కోరారు.

ఇదీ చదవండి: దేవినేనిని అడ్డుకున్న పోలీసులు.. ఇంటి ఆవరణలోనే దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.