DHULIPALLA: తెరాస-వైకాపా మధ్య రహస్య బంధం మరోసారి బహిర్గతమైందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. సీఎం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తన సహనిందితుడు హెటిరో పార్థసారథిరెడ్డికి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాజ్యసభ పదవికి ఎంపిక చేసిన వారిలో ఇద్దరు జగన్ సహనిందితులు, మరో వ్యక్తి జగన్ న్యాయవాది అని మండిపడ్డారు. పార్థసారథి విషయంలో జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరించారని ఆరోపించారు.
ఇవీ చదవండి: 'వైఎస్‌ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల'ను ప్రారంభించిన సీఎం జగన్