అమరావతి రైతు ఉద్యమం 683వ రోజుకు చేరుకుంది. తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేసేందుకు నవంబరు 1వ తేది నుంచి మహా పాదయాత్రకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. తుళ్లూరులోని దీక్ష శిబిరంలో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు(special pooja at initiation camp in Tulluru). ఎలాంటి ఆటంకాలూ లేకుండా పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.
పాదయాత్రలో తెదేపా కుటుంబంలోని ప్రతి వ్యక్తీ పాల్గొంటారు: ఉమా
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు నిర్వహించే పాదయాత్రకు తమ మద్దతు(devineni uma support to Amaravati farmers maha padayatra) ఉంటుందని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. వెలగపూడిలోని ఐకాస కార్యాలయంలో నిర్వహించిన రైతుల విస్తృత సమావేశానికి హాజరయ్యారు. మహా పాదయాత్రలో తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి వ్యక్తీ పాల్గొంటారని.. రైతులకు అండగా ఉంటారని ఉమా చెప్పారు. అమరావతి కోసం మహిళలు ఎన్నో పోరాటాలు చేశారని.. ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ పాదయాత్ర.. అమరావతి ఉద్యమానికి విజయయాత్ర(tdp leader devineni uma on maha padayatra) కావాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి..