వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూత్వంపై దాడి జరుగుతోందంటూ సూర్య దేవాలయాల్లో ఆయన పూజలు నిర్వహించారు. గత పదహారు నెలలుగా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడులు పట్ల గట్టిగా చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ప్రజలు దీక్షలు చేస్తూ రోడ్డు మీదకు వస్తున్నారన్నారు. పిఠాపురంలో ఆరు దేవాలయాల్లో 23 విగ్రహాలు ధ్వంసం చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. సింహాచలం శ్రీ నృసింహ స్వామి వారి వేల కోట్ల రూపాయల విలువైన ఆలయ భూముల్ని ట్రస్ట్ బోర్డు మార్పు చేసి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో ఏ మతం వారి మనోభావాలు దెబ్బతినే దుశ్చర్యలు జరగకూడదని చినరాజప్ప ఆకాక్షించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలోని ఆలయాలకు పటిష్ట భద్రత: డీజీపీ