ETV Bharat / city

'అవినీతిని కప్పిపుచ్చేందుకే సీబీ'ఐ'.. ఏడాదంతా కుంభకోణాలే..!' - తెదేపా పథకాలపై సీబీఐ విచారణ వార్తలు

గత ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలపై సీబీఐ విచారణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఖండించారు. ఏడాదిలోనే రాష్ట్రంలో అవినీతి, కుంభకోణాలు పెరిగాయని విమర్శించారు. సీఎం జగన్​కు ధైర్యం ఉంటే తన పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చెయ్యించాలని టీడీఎల్పీ నేతలు డిమాండ్​ చేశారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.

'అవినీతిని కప్పిపుచ్చేందుకే సీబీ'ఐ'.. ఏడాదిలో కుంభకోణాలు పెరిగాయ్​..!'

author img

By

Published : Jun 11, 2020, 8:37 PM IST

వైకాపా ఏడాది పాలనలోనే అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆన్​లైన్​ ద్వారా ఆయన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. మద్యం, ఇసుక, గనులు, భూసేకరణ, కరోనా కిట్లు, బ్లీచింగ్‌లో కుంభకోణాలు జరిగాయన్న చంద్రబాబు... తెదేపా ఛార్జిషీట్‌లో వీటన్నింటినీ బట్టబయలు చేసినట్లు తెలిపారు. తెదేపా హయాంలో పథకాలపై సీబీఐ విచారణ చెయ్యించాలన్న నిర్ణయాన్ని నేతలు ఖండించారు. వైకాపా వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మళ్లీ వీటిని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.

తప్పులు కప్పిపుచ్చేందుకే...

ప్రభుత్వం తప్పులు కప్పిపుచ్చేందుకే అప్పటి పథకాలకు సీబీఐ విచారణ ముసుగు వేశారని టీడీఎల్పీ నేతలు ఆరోపించారు. పేదలకిచ్చే పండుగ కానుకలు, ఫైబర్ గ్రిడ్, చంద్రన్న బీమాపై సీబీఐ విచారణ నిర్ణయాన్ని వారు తప్పుబట్టారు. వీటిని సక్రమంగా ఉపయోగించడం చేతకాక మూలనపడేసి బురద జల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా పథకం నిలిచిపోవడం వల్ల ఏడాదిగా ఎన్నో పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిపివేయడంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీఎల్పీ నేతలు అభిప్రాయపడ్డారు.

అవినీతిపై విచారణ చెయ్యాలి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే గత ఏడాదిగా రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని టీడీఎల్పీ నేతలు డిమాండ్​ చేశారు. మైనింగ్​, మద్యం మాఫియాపైనా విచారణ చేయాలన్నారు. సాక్షి మీడియాకు ఇచ్చిన ప్రకటనలపై సైతం దర్యాప్తు జరపాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

'ఆగస్టు నుంచి పల్లెబాట.. అధికారులూ సిద్ధం కండి..!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.