వైకాపా.. బీసీల వ్యతిరేక పార్టీ అని.. తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. సలహాదారుల్లో ఎంతమంది బీసీలున్నారో.. సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బీసీలు ఎక్కువుగా ఉన్నందున.. వారిని దోచుకునేందుకే విశాఖను ఎంచుకున్నారని దుయ్యబట్టారు. బీసీ పోలీసు అధికారి శ్రీహరికి వర్తించిన సస్పెన్షన్.. నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డికి ఎందుకు వర్తించదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు