ETV Bharat / city

'ఆలయాలపై దాడులకు మంత్రి వెల్లంపల్లిదే బాధ్యత' - అంతర్వేది ఆలయ ఘటన

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​పై తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెల్లంపల్లి గుడిలో లింగాన్ని మింగే రకమన్నారు. లంచాలు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారని దుయ్యబట్టారు.

Bonda Umamaheswara Rao  fiers on minister vellampalli

author img

By

Published : Sep 9, 2020, 8:01 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చాక హిందూమతం, దేవాలయాలపై దాడులు పెరగడంతో పాటు మత మార్పిడులు ఎక్కువయ్యాయని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​... గుడిలో లింగాన్ని మింగే రకమని ఆరోపించారు. లంచాలు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారని అన్నారు.

కరోనా పేరుతో వ్యాపారుల దగ్గర 10 కోట్లు కొట్టేశారని చెప్పారు. గ్రామ వాలంటీర్లతో మత మార్పిడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పిఠాపురంలో ఒకే రోజు 23 గుళ్లపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దాడులు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. ఘటనలకు బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

దేవాలయాల పరిరక్షణకు ఈనెల 11న దీక్ష: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.