ETV Bharat / city

ఉత్తరాంధ్రకు మంత్రి బొత్స ద్రోహం చేశారు: అయ్యన్న - tdp leader ayyanna criticises minister botsa

తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు మంత్రి బొత్సకు లేదని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. అప్పట్లో జగన్​ను బొత్స విమర్శించారని.. ఇప్పుడు పొగుడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తోందని విమర్శించారు.

ఉత్తరాంధ్రకు మంత్రి బొత్స ద్రోహం చేశారు: అయ్యన్నపాత్రుడు

author img

By

Published : Jun 9, 2020, 6:19 PM IST

Updated : Jun 9, 2020, 7:32 PM IST

ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన నాయకుల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వోక్స్ వాగన్ ఫ్యాక్టరీ విశాఖ వచ్చుంటే ఉత్తరాంధ్ర అప్పుడే అభివృద్ధి చెంది ఉండేదన్న ఆయన.. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు మంత్రి బొత్సకు లేదని స్పష్టం చేశారు.

వైఎస్​ చనిపోవడానికి జగనే కారణమని గతంలో బొత్స విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం అయ్యాక జగన్ భజన చేస్తున్నారని ఆక్షేపించారు. ఒకప్పుడు బొత్స.. లిక్కర్​ వ్యాపారం చేశారని.. జనం ప్రాణాలు పోయినా.. ఆదాయం మాత్రం రావాలని చూస్తారని అన్నారు. మద్యం పేరుతో విషం విక్రయించవద్దని సీఎం జగన్​కు బొత్స ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. విశాఖలో భూముల సిట్ రిపోర్టును వైకాపా ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

ప్రభుత్వ అవినీతిని బయటపెడతాం: కొల్లు రవీంద్ర

Last Updated : Jun 9, 2020, 7:32 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.