రాష్ట్ర ప్రభుత్వం రోజూ ప్రకటిస్తున్న కరోనా మరణాల సంఖ్యలో వాస్తవమెంత అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. విశాఖలో తెలుగుదేశం కార్యాలయంలో... అందరికీ వ్యాక్సిన్ అందించాలనే నినాదంతో నేతలతో కలసి దీక్ష చేశారు. కొత్తగా తమిళనాడు సీఎం పదవిని చేపట్టిన స్టాలిన్‌ను చూసి జగన్ నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ప్రాణం పోతున్న పరిస్థితుల్లో పథకాల కంటే టీకానే ముఖ్యమని అచ్చెన్న అన్నారు.
'ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పా..? సలహాలు తీసుకోకుండా మాపైనే విమర్శలు చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ముఖ్యం. కరోనా వ్యాప్తి నివారణపై శ్రద్ధ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. కరోనా మృతుల బంధువుల ఆర్తనాదాలు సీఎంకు వినిపించట్లేదా..? పూర్తి లాక్‌డౌన్ పెడితేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయి' - అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: