రాజధాని పర్యటనలో చంద్రబాబుపై దాడి చేయించిందెవరో ప్రభుత్వం బయటపెట్టాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంట్రావు...రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు. రాజధాని పర్యటనకు చంద్రబాబు ఉపయోగించిన బస్సు సీజ్ చేశారని తెలిపారు. దర్యాప్తు పేరుతో బస్సు యాజమాన్యంపై ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు బస్సు వెంటనే విడుదల చేసి చట్ట ప్రకారం పని చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలు మానుకుని... పాలనపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని కళా వెంకట్రావు సూచించారు.
ఇవి కూడా చదవండి: