అమరావతి రైతుల పోరాటం నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయవాడ నగర శివారు గొల్లపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, స్థానిక తెదేపా నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కిి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమం ఆగదని దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్ కాళ్ల బేరానికి దిల్లీ వెళ్లారని ఉమ విమర్శించారు. అమరావతి ప్రజల ఉసురు జగన్కు తగులుతుందని...దీనికి మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. అమరావతి రక్షణకై 'జనభేరి' భారీ బహిరంగ సభకు తెదేపా అధినేత చంద్రబాబు, అన్ని రాజకీయ పక్షాల నేతలు హాజరవుతారన్నారు.
ఇదీ చదవండి: