ETV Bharat / city

విశాఖలో.. వైకాపా వసూళ్ల దందా: చంద్రబాబు - వైసీపీపై చంద్రబాబు కామెంట్స్

వైకాపా నాయకులకు కరోనా.. ఓ ఏటీఎం​​లా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ట్రస్టు ముసుగులో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు, నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై చర్చించారు.

విశాఖలో.. ట్రస్టు పేరుతో వసూళ్ల దందా : చంద్రబాబు

author img

By

Published : Apr 29, 2020, 4:21 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. గతంలో అనేక విపత్తుల సమయంలో ప్రజలకు వెన్నంటి నిలిచామని చంద్రబాబు గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా పనిచేశామన్నారు. ఇప్పుడు కరోనా విపత్తులోనూ బాధితులకు పార్టీ నేతలు అండగా ఉండాలన్నారు. క్లిష్టపరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలన్న చంద్రబాబు... రైతులు, పేదలు, కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

వైకాపా నేతలే కరోనా వాహకాలు

స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వైకాపా నేతలు గుంపులుగా తిరిగారని చంద్రబాబు ఆరోపించారు. ప్రచారం కోసం.. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాలను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. దేశంలో వైరస్ తీవ్రంగా ఉన్న 15 జిల్లాల్లో కర్నూలు ఒకటి కావడం ఆందోళనకరమని చంద్రబాబు అన్నారు. తెదేపా రాసిన లేఖలతో విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరిందన్నారు.

ట్రస్టు ముసుగులో వసూళ్ల దందా

అరువుపై ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు కల్పించారని చంద్రబాబు విమర్శించారు. అకాల వర్షాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనాలన్న చంద్రబాబు.. రైతు భరోసా నుంచి విశాఖలోనే 32 వేలమంది పేర్లు తీసేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలమంది పేర్లు తొలగించారని ఆక్షేపించారు. విజయసాయిరెడ్డి విశాఖలో విపరీతంగా చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ట్రస్టు ముసుగులో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంపిణీ ముసుగులో వైకాపా ఎమ్మెల్యేలు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారన్నారు. కరోనా వైకాపా నాయకులకు ఏటీఎం​గా మారిందని చెప్పారు. వీటన్నింటిపై మండల స్థాయిలో కూడా దీక్షలు చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపిచ్చారు. 12 గంటల దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.

ఇదీ చదవండి:

చిల్లర కోసం... సముద్ర తీరాన గంగపుత్రుల వెతుకులాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.