ETV Bharat / city

దేవినేనిని అడ్డుకున్న పోలీసులు.. ఇంటి ఆవరణలోనే దీక్ష - తెదేపా నేత దేవినేని ఉమ తాజా వార్తలు

అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా... నిరసన దీక్షకు వెళ్తున్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. ఉమా దీక్షకు ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు తెలిపారు. పోలీసులతో దేవినేని ఉమ, దూళిపాళ్ల నరేంద్ర వాగ్వాదానికి దిగారు. తన ఇంటి ఆవరణలోనే దేవినేని ఉమ దీక్షకు కూర్చున్నారు.

TDP DevineniUma
TDP DevineniUma
author img

By

Published : Jan 20, 2021, 12:13 PM IST

పోలీసులు అడ్డుకోవడంతో తన ఇంటి ఆవరణలోనే దీక్షకు కూర్చున్న దేవినేని

అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా నిరసన దీక్షకు వెళ్తున్న తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమాతో పాటు... పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను సైతం అక్కడి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులతో తెదేపా నేతలు వాగ్వాదానికి దిగారు. అధికారపార్టీ నేతలకు అనుమతిచ్చి తమను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పటికీ... పోలీసులు అనుమతి నిరాకరించిన కారణంగా.. దేవినేని తన ఇంటి ఆవరణలోనే దీక్షకు కూర్చున్నారు.

ఇదీ చదవండి:

పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.