మీ స్వరాల.. అభిషేఖం మూగపోయింది. పాడుతా తీయగా చల్లగా అన్న వేదిక కన్నీరు పెడుతుంది. ప్రతి స్త్రోతకు బాలు లేడనే వార్త కలవరపెడుతోంది. నీ పాటను విన్న ప్రతిక్షణం మా హృదయాంతరాలు ఆనదించాయి. సెలవన్నది మీ శరీరానికే కానీ.. మీ గళానికి కాదు. గానగంధర్వుడు బాలసుబ్రమణ్యం గారి పవిత్రఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.- గల్లా జయదేవ్, తెదేపా ఎంపీ
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కి తెలుగు జాతి ఖ్యాతిని పెంచారు. ఐదు విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ పొందిన తమ నెల్లూరు బిడ్డ బాలసుబ్రమణ్యం. బాలు లేని లోటు తీర్చలేనిది. ఆయన మృతి పట్ల వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి తీవ్ర విచారకరం. ఎస్పీ మరణవార్త తీవ్రంగా కలిచివేసింది. బాలు మృతి భారతీయ సినీ లోకానికి తీరని లోటు. బాలసుబ్రమణ్యం ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.- కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం