ETV Bharat / city

RAJAMPET MUNICIPAL POLL: ఫామ్ -19 కాపీలపై ఎస్ఈ​సీకి తెదేపా ఫిర్యాదు - TDP Complaint to SEC

రాజంపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలపై ఈసీకి తెదేపా ఫిర్యాదు చేసింది. పలు వార్డుల్లో తెదేపా అభ్యర్థులకు ఫామ్ - 19 కాపీలను ఇవ్వలేదని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు కోరారు.

RAJAMPET MUNICIPAL POLL
RAJAMPET MUNICIPAL POLL
author img

By

Published : Nov 16, 2021, 7:34 PM IST

రాజంపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వివిధ వార్డులకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ఇంతవరకూ తెదేపా అభ్యర్థులకు ఫామ్ -19 ఇవ్వలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజంపేట 15, 23, 24, 27, 29 వార్డుల్లో పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నో విజ్ఞాపనలు చేసినా ఫామ్ 19 వారికి అందజేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలింగ్ ముగియగానే ఫామ్ 19 పొందటం అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ ప్రాథమిక హక్కని వివరించారు. సోమవారం సాయంత్రం 5గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిసినా ఇంతవరకూ ఫారాలు ఇవ్వకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. తక్షణమే ఫామ్ 19కాపీలు సంబంధిత తెదేపా అభ్యర్థులకు ఇచ్చేలా రిటర్నింగ్ అధికారిని ఆదేశించాలని లేఖలో కోరారు.

ఇదీ చదవండి:

Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.