అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత హత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ , జాతీయ మహిళా కమిషన్లకు తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు, ఆత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళల ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, స్నేహలతకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని అనిత ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బుక్ చేసుకున్న బస్ మిస్సయితే తర్వాత వచ్చే సర్వీస్‌లో వెళ్లొచ్చు