ETV Bharat / city

గ్రామాల్ని దోచుకునేందుకే ఏకగ్రీవాల జపం: చంద్రబాబు - చంద్రబాబుతాజా వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకూ రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసేసి అమ్మకాలు రద్దు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గ్రామాలను దోచుకునేందుకే ప్రభుత్వం ఏకగ్రీవాల జపం చేస్తోందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు ముకుతాడు వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈసీ చర్యలు తీసుకున్న అధికారులకు డబుల్‌ ప్రమోషన్‌ ఇస్తామని మంత్రి అనడం రాజ్యాంగ ఉల్లంఘనేనని చంద్రబాబు అన్నారు.

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Jan 28, 2021, 5:10 AM IST

'తెదేపా హయాంలో గ్రామాలన్నీ సిమెంటు రోడ్లు, పచ్చదనంతో కళకళలాడేవి. 100% వీధి దీపాలు, మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు ఏర్పాటుచేశాం. వైకాపా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆపేశారు. ఏలూరు, దెందులూరు, కాళ్లలో వందల మందిని ఆస్పత్రి పాలు చేశారు. ఎక్కడ చూసినా చెత్త దిబ్బలు, అధ్వాన పారిశుద్ధ్యమే. వెలగని వీధి దీపాలను మార్చే పరిస్థితి లేదు.'

‘గ్రామాల్ని దోపిడీ చేసేందుకే వైకాపా ప్రభుత్వం ఏకగ్రీవాల జపం చేస్తోంది. 10 నెలల కిందటి జీవోకు ఇప్పుడు ప్రకటనలివ్వటం తుగ్లక్‌ చర్య. అందులోనూ తెలంగాణ లోగో ఉన్న ఫొటో ముద్రించడం సిగ్గుచేటు. జగన్‌ సీఎం అయ్యాక అధికార యంత్రాంగం నీరుగారింది. అధికారుల్లో కొందరు వెన్నెముక లేని వ్యక్తులుగా తయారయ్యారు’

- చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అరాచకాలకు ముకుతాడు వేయాలని ఓటర్లకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘వైకాపా నాయకులు ఇప్పటికే అడ్డూఅదుపూ లేకుండా రాష్ట్రంలో అభివృద్ధిని నాశనం చేశారు. గ్రామాల్లో వీరు రెచ్చిపోకుండా అడ్డుకునే ఎన్నికలు ఇవి’ అని వివరించారు. ‘గ్రామ స్వరాజ్యంపై, స్థానిక స్వపరిపాలనపై వైకాపాకు చిత్తశుద్ధి, విశ్వసనీయత లేవు. 20 నెలల పాలనలో వైకాపా ఏం చేసింది, అంతకుముందు తెదేపా ఏం చేసిందో ప్రజలే ఆలోచించాలి’ అని విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్టీ నాయకులు, నియోజకవర్గ బాధ్యులతో వీడియో సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘చట్టాలను గౌరవించి రాజ్యాంగాన్ని కాపాడే వాళ్లకే ప్రజాదరణ ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు జరగకూడదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అందరి లక్ష్యం కావాలి. స్థానిక సంస్థల్లో కావాల్సింది స్వపరిపాలన.. బయటవాళ్ల పెత్తనం కాదు. మన పరిపాలన మనమే చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలెంతో.. పల్లెల్లో స్వపరిపాలన కూడా అంతే ముఖ్యం’ అని పేర్కొన్నారు.

భయభ్రాంతులను చేసి గెలుపొందడమే వారి లక్ష్యం
‘ప్రలోభాలు, వేధింపులు, బెదిరింపులు, హింసా విధ్వంసాలే జగన్‌ దినచర్య. భయభ్రాంతులను చేసి గెలుపొందడమే వారి లక్ష్యం. జగన్‌ రెడ్డి సీఎం కాగానే అదే దుష్ట సంస్కృతి రాష్ట్రమంతా పాకింది. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, భౌతిక దాడులకు దిగటం, నామినేషన్‌ పత్రాలు బలవంతంగా లాక్కోవడం, కిడ్నాపులు, హత్యాయత్నాలు వైకాపా అరాచకాలకు పరాకాష్ఠ’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘పంచాయతీ ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. గతేడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా వైకాపా అరాచకాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. అప్పుడు వీరోచితంగా పోరాడినా 25% పైగా బలవంతపు ఏకగ్రీవాలు చేశారు. బెదిరించి, ప్రలోభపెట్టి అధికారులను లొంగదీసుకున్నారు’ అని దుయ్యబట్టారు.

అన్ని గ్రామాల్లో తెదేపా అభ్యర్థులు గెలవాలి
‘మత సామరస్యం కాపాడాలంటే అన్ని గ్రామాల్లో తెదేపా అభ్యర్థులు గెలవాలి. అలా జరిగితేనే గ్రామాలను అభివృద్ధి చేయటంతో పాటు నరేగా నిధులను రాబట్టగలం. తప్పుడు కేసులు మనల్ని అడ్డుకోలేవు. పోరాటాల్లోనే సిసలైన నాయకత్వం బయటకొస్తుంది. వైకాపా ఉన్మాదానికి అడ్డుకట్ట వేసి ధర్మపరిరక్షణ సాగించాలి’ అని నిర్దేశించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నాయకులు డీబీవీ స్వామి, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యనారాయణమూర్తి, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, చెంగల్రాయుడు, ఉగ్ర నరసింహారెడ్డి, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, బోడె ప్రసాద్‌, పీలా గోవిందు సత్యనారాయణ, టీడీ జనార్దన్‌, చింతకాయల విజయ్‌, వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఏకగ్రీవాల ప్రకటనలో రాజకీయం ఎక్కడుందో ఎస్‌ఈసీ చెప్పాలి: మంత్రి పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.