ETV Bharat / city

తెలంగాణలో కొనసాగుతున్న బంద్.. పలువురు అరెస్ట్​

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అన్ని రాజకీయ, ప్రజాసంఘాలు ఇవాళ తెలంగాణ బంద్‌ చేపట్టాయి. తెలంగాణవ్యాప్తంగా బంద్​ కొనసాగుతోంది. ఈ బంద్‌ పిలుపునకు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర కార్మిక సంఘాలూ మద్దతు ప్రకటించాయి. బంద్​ నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

తెలంగాణలో కొనసాగుతున్న బంద్
author img

By

Published : Oct 19, 2019, 9:49 AM IST

తెలంగాణలో కొనసాగుతున్న బంద్

ఆర్టీసీ సమ్మెలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్​ పాటిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఎన్జీవోలు, ఉపాధ్యాయసంఘాలు, ఆటో యూనియన్లు బంద్​లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ డిపోలు, బస్టాండ్ల వద్ద కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. ఆందోళన చేస్తున్న రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. బంద్​ ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు మధ్య బస్సులను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్​ పిలుపునకు సంఘీభావం తెలిపిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోపాటు తెదేపా నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు కార్యకర్తలను జేబీఎస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని లాలాగూడ పీఎస్​కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేసి పోరాటాన్ని నీరుకార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కోదండరాం తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.