ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. వైకాపా ఆరు నెలల పాలనలో సంక్షేమాన్ని గాలికి వదిలివేసిందని తెదేపా నేతలు ఆరోపించారు. బీసీలు బ్యాక్ బోన్ అన్న సీఎం.. వారినే మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెదేపా నేతలు మండిపడ్డారు. కేంద్రం ఉపాధి హామీ పథకానికి రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేసినా... ఆ నగదును తీసుకురాలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాల ఇస్తామని.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల తొలగింపుపై చర్చించాలని నేతలు అన్నారు. బిల్డ్ ఏపీగా కాకుండా సేల్ ఏపీగా మారుస్తున్నారని విమర్శించారు. మీడియా ఆంక్షలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెదేపా నేతలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :