ETV Bharat / city

పన్నుల రాబడి.. అప్పుల ఒరవడి సమం - ఆంధ్రప్రదేశ్‌లో పన్నులు

ఆంధ్రప్రదేశ్‌లో పన్నుల రాబడి ఎంత మొత్తంలో ఉందో అప్పుల ఒరవడి దాదాపు అంతే మొత్తంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల లెక్కల పరిశీలన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అకౌంట్సు విభాగం పూర్తిచేసింది.

tax
tax
author img

By

Published : Oct 6, 2021, 7:28 AM IST

ఆగస్టు నెలాఖరుతో పూర్తయిన తొలి అయిదు నెలల్లో రాష్ట్రానికి పన్నుల రూపంలో రూ.37,050.79 కోట్లు వచ్చాయి. అప్పులు, ఇతర రుణ రూపాల్లో రూ.36,976.93 కోట్లు సమీకరించింది. అంటే రాష్ట్రానికి జీఎస్టీ, రిజిస్ట్రేషన్ల ఆదాయం, అమ్మకపు పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీ, భూమి శిస్తు, కేంద్ర పన్నుల్లో వాటాగా వచ్చే మొత్తం, ఇతర పన్నులు-సుంకాల రూపంలో అయిదు నెలల్లో ఎంత మొత్తం వచ్చిందో, దాదాపు అంతే మొత్తం రుణంగా తీసుకుని ఖర్చుచేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో రూ.90,071.35 కోట్లు ఖర్చుచేశారు. దీనికి కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు రూ.14,641.64 కోట్లు, పన్నేతర ఆదాయంగా వచ్చిన రూ.1,466.68 కోట్లు తోడయ్యాయి. అప్పులో బహిరంగ మార్కెట్‌ నుంచి సమీకరించింది రూ.17,607.90 కోట్లు. మిగిలిన రూ.19,418.60 కోట్లు ఇతర ప్రజాపద్దు రూపంలో సమీకరించి ఖర్చు చేసినట్లు కాగ్‌ లెక్కలు పేర్కొంటున్నాయి.

కిందటి ఏడాది కన్నా నయం...

రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా ఎక్కువే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి అయిదు నెలలకు పన్నుల రాబడి రూ.24,998.50 కోట్లు. ఈసారి అది రూ.37,050.79 కోట్లు. ఏటా రాబడి 10% పెరుగుతుందని ఆర్థికశాఖ లెక్కిస్తుంది. అలా చూసినా పన్నుల రాబడి మెరుగయినట్లే. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కరోనా రెండోదశ రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. అయినా ఆయా నెలల్లో ఆదాయం గతేడాది కన్నా మెరుగ్గానే ఉందని లెక్కలు చెబుతున్నాయి. పన్నేతర ఆదాయమూ గతేడాది కన్నా రూ.400 కోట్లు అదనంగా వచ్చింది. కేంద్ర గ్రాంట్లూ ఈ ఏడాది అదనంగా వచ్చాయి. 2020-21లో కేంద్రం సాయం తొలి అయిదు నెలలకు రూ.11,428.59 కోట్లు ఉంటే ప్రస్తుతం అది రూ.14,641 కోట్లకు పెరిగింది.

మూలధన వ్యయం తక్కువే

రెవెన్యూ ఖర్చుల కన్నా మూలధన వ్యయం ఎక్కువగా ఉంటే అది రాష్ట్రానికి ప్రయోజనం. ఆదాయం మెరుగుపడ్డా ఈ విషయంలో గతేడాది కన్నా ఖర్చు తక్కువే. నాడు రూ.8,608.64 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.5,482.53 కోట్లకే పరిమితమయింది.

ఇదీ చదవండి: TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రమే అంకురార్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.