ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను 30శాతం తగ్గిస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా జూనియర్ కళాశాలల పనిదినాలు తగ్గినందున సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే పరీక్షల్లో 70శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తాయని, తొలగించిన 30శాతాన్ని సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు, ఖాళీ పీరియడ్స్‌లో బోధించాలని సూచించారు. గతేడాది 2020-21లోనూ 30శాతం సిలబస్‌ను తగ్గించారు. సబ్జెక్టుల వారీగా తొలగించిన పాఠాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
పాఠశాల విద్యలోనూ తగ్గింపు..
పాఠశాల విద్యలో ఇప్పటికే సబ్జెక్టుల వారీగా రెండేసి అధ్యాయాలు(ఛాప్టర్స్) తగ్గించారు. ఈ మేరకు అకడమిక్ కేలండర్‌ను విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా తగ్గించిన సిలబస్ వివరాలను ఉపాధ్యాయులకు అందించారు.
ఇదీ చదవండి: