రేపటి చంద్రబాబు రాష్ట్ర పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ వెళ్లి గ్యాస్ లీకేజ్ బాధితులను పరామర్శించేందుకు...., తర్వాత రోడ్డుమార్గంలో అమరావతి వచ్చేందుకు అనుమతి కోరుతూ రెండు లేఖలు రాశారు. ఈ పర్యటనలకు తెలంగాణ, ఏపీ డీజీపీల అనుమతి కోరుతూ లేఖ రాశారు. తెలంగాణ డీజీపీ నుంచి వెంటనే అనుతి వచ్చింది. ఏపీ డీజీపీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కొన్ని రోజుల క్రితం రోడ్డుమార్గంలో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లేందుకూ అనుమతివ్వాలంటూ ఏపీ డీజీపీకి మరో లేఖ రాశారు. ఆ లేఖకి కూడా ఎటువంటి స్పందన రాలేదు.
ఇదీ చదవండి: